: మహాపురుషులు పుట్టిన గడ్డపై బొత్స తప్పబుట్టాడు: బాబు
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రానికి సహకరించిన బొత్స మహాపురుషులు పుట్టిన విజయనగరంలో తప్పబుట్టాడని విమర్శించారు. విజయనగరంలో జరుగుతున్న ప్రజాగర్జన సభలో ప్రస్తుతం బాబు మాట్లాడుతున్నారు. బొత్స తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడిన పేర్కొన్నారు.