: భారత పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజు
సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ నేడు భారత్ లో అడుగుపెట్టారు. ఆయన భారత్ లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రక్షణ రంగంలో ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. భద్రత విషయంలో పరస్పర సహకారం పెంపొందించుకునే విషయమై చర్చలు జరుపుతారు. కాగా, ఈ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న సౌదీ యువరాజుకు విమానాశ్రయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఘనస్వాగతం పలికారు.