: తండ్రైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు కొడుకు పుట్టాడు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైందని వివేక్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ లో సంతోషకరమైన ఈ వార్తను వివేక్ అభిమానులతో పంచుకున్నాడు. 2010లో కర్నాటక మాజీ మంత్రి జీవరాజ్ కుమార్తె ప్రియాంకను వివేక్ ఒబెరాయ్ మనువాడిన సంగతి తెలిసిందే. తండ్రైన సందర్భంగా వివేక్ కు రితీష్ దేశ్ ముఖ్, జెనీలియా, ప్రియాంక చోప్రా, బాలీవుడ్ తారలు అభినందించారు.