: కొత్త రాజధాని రియల్టర్ల పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
సీమాంధ్రకు కొత్తగా ఏర్పడే రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ అన్నారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై నాయకులు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వమే లక్ష ఎకరాల భూమిని సేకరించి నూతన రాజధానిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.