: వోల్వో బస్సు కేసులో ఉమారెడ్డి అరెస్ట్... బెయిల్ పై విడుదల


వోల్వో బస్సు కేసుకు సంబంధించి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డిని అరెస్ట్ చేసి ఈరోజు (బుధవారం) మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

మహబూబ్ నగర్ జిల్లా ‘పాలెం’ వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం కేసుపై సీఐడీ విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన ఉమారెడ్డి సహా 9 మందిని అరెస్ట్ చేయడంతో సీఐడీ విచారణ పూర్తి అయిందని అదనపు డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News