: మాజీ పత్రికా సంపాదకుడిపై కత్తితో దాడి!
పత్రికా స్వాతంత్ర్యం కోసం పోరాడి, చివరకు ఉద్యోగం కోల్పోయిన ఓ పత్రికా సంపాదకుడు కెవిన్ పై ఓ ఆగంతుకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఈరోజు (బుధవారం) ఉదయం హాంకాంగ్ లో జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ మీద వచ్చిన వ్యక్తి కెవిన్ పై దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడని పోలీసులు చెప్పారు. హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అప్పటికి ఆయన స్పృహలోనే ఉన్నారని పోలీసులు తెలిపారు.
కెవిన్ పై దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హాంకాంగ్ లో మింగ్ పావో అనే వార్తాపత్రికకు 2012 నుంచి ఆయన సంపాదకునిగా పనిచేస్తున్నారు. కానీ, పత్రికా స్వాతంత్ర్యం గురించి పోరాడినందుకు గత నెలలో ఆయన ఉద్యోగం కోల్పోయారు.