: బేగంపేటకు చేరుకున్న తెలంగాణ జాగృతి ర్యాలీ


తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయంతో హైదరాబాదు నగరానికి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ర్యాలీ కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది.

కేసీఆర్ కూతురు కవిత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, కవిత ప్రజలకు చేరువయ్యారు.

  • Loading...

More Telugu News