: 'సత్యమేవ జయతే 2' కోసం పాడిన అమీర్


నటుడు అమీర్ ఖాన్ తను నిర్మిస్తున్న 'సత్యమేవ జయతే 2' కోసం గొంతు విప్పాడు. ఈ మేరకు ఈ షో టైటిల్ ట్రాక్ కు పాడాడట. తొలి సీజన్లో ఉపయోగించిన పాటనే ఇప్పుడు ఉపయోగిస్తుండగా, కేవలం అమీర్ పాడిన కొన్ని లైన్స్ ను ప్రత్యేకంగా రికార్డు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ పాట వీడియోను మాత్రం కొత్తగా తయారు చేస్తున్నారట. ఇందులో మహిళలు, స్కూలు పిల్లలు, వ్యవసాయదారులు, ఇతర రంగాలకు చెందిన పలువురు కనిపిస్తారట. భారతదేశంలోని సున్నితమైన సామాజిక సమస్యల ఆధారంగా రూపొందిస్తున్న ఈ షో రెండవ సీజన్ మార్చి 2 నుంచి ప్రసారం కానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై అమీర్, భార్య కిరణ్ రావులు నిర్మిస్తున్నారు. అమీర్ గతంలో తన చిత్రం 'గులామ్'లో తొలిసారి పాడాడు.

  • Loading...

More Telugu News