: సోనియా, రాహుల్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది: కొండ్రు మురళి
సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందని మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకోలేమని అధినాయకత్వానికి చెప్పామన్నారు. రాష్ట్రపతి పాలన కాకుండా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్టు కొండ్రు తెలిపారు. ఎన్నికలకు మరికొంత సమయం ఇస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని కొండ్రు అభిప్రాయపడ్డారు. తాను చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని కొండ్రు స్పష్టం చేశారు.