: కేసీఆర్ ర్యాలీకి 20 ప్లటూన్ల భద్రత: సీపీ
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 20 ప్లటూన్లతో భద్రత ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వెల్లడించారు.