: అండగా ఉంటామనడం ఫ్యాషనైపోయింది: విద్యుత్ జేఏసీ
హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని సీమాంధ్ర విద్యుత్ జేఏసీ ఉద్యోగులు మండిపడ్డారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, సీమాంధ్రులకు అండగా ఉంటామని చెప్పడం తెలంగాణ నేతలకు పెద్ద ఫ్యాషనైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులతో తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.