: మద్యం సిండికేట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
మద్యం సిండికేట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో పూర్తి ఆధారాలున్న ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం చెప్పింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ సమయంలో ఏసీబీ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించింది. ప్రజాప్రతినిధుల ప్రాసిక్యూషన్ కు అడ్వయిజరీ కమిటీ అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు సంబంధించి 1999లో ప్రభుత్వం జారీ చేసిన మెమో రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టు ఈ రోజు కొట్టివేసింది.