: సోనియాతో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఢిల్లీలోని సోనియా నివాసంలో దాదాపు యాభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. విభజన, సీఎం రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేతలంతా మేడమ్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే, విభజన ఇష్టంలేని సీమాంద్ర ప్రజల్లో పార్టీపై సదభిప్రాయం ఏర్పడేలా, వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చేలా ప్రచారం చేయాలని నేతలకు సోనియా సూచించినట్లు సమాచారం. అందుకు నేతలంతా తమ వంతు కృషి చేస్తామని చెప్పినట్లు వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News