: ఇస్రోతో చేతులు కలపనున్న నాసా
త్వరలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి నాసా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. జలవనరుల అన్వేషణ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సింథటిక్ అపెర్చర్ రాడార్ మిషన్ గా నామకరణం చేశారు. ఈ సిరీస్ లో వచ్చే ఏడేళ్ళలో మరికొన్ని ఉపగ్రహాలనూ ప్రయోగించాలని ఇస్రో, నాసా నిర్ణయించాయి. ఈ ఉపగ్రహాల పరంపర ద్వారా భూమిపై జల వనరులతో పాటు కచ్చితమైన వాతావరణ సమాచారం సేకరించేందుకు కూడా వీలవుతుంది. భూమండలంపై పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అధ్యయనం చేస్తారు.