: అనూహ్య కేసును తొందరగా తేల్చండి: ముంబై కొత్త పోలీస్ బాస్


ముంబైలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అనూహ్య ఎస్తేర్ కేసు దర్యాప్తుపై ముంబై కొత్త పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 9న హత్యకు గురైతే.. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, నిందితులెవరో గుర్తించలేకపోవడం తెలిసిందే. దీనిపై రాకేశ్.. దర్యాప్తు అధికారులను నిలదీశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాకేశ్ ముంబై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనూహ్య కేసు ప్రస్తావనకు వచ్చింది. కేసు దర్యాప్తులో త్వరగా ఫలితాలు చూపించాలని ఆయన ఆదేశించారు. దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి నిందితులను పట్టుకోవాలని లోగడ కేంద్ర హోంమంత్రి షిండే కూడా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News