: రెండు చేతులకు బీపీ చూసి, గుండె జబ్బుల ఆచూకీ తెలుసుకోవచ్చు


గుండె జబ్బులను గుర్తించేందుకు పలు రకాల వైద్య పరీక్షలు, చేతినిండా డబ్బు, రోజుల తరబడి సమయం అవసరమవుతాయి. వీటిని ఆదా చేసేందుకు కొత్త విధానం అందుబాటులోకి రానుంది. గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవాలంటే మాత్రం రెండు చేతులకు బీపీ చూడాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. రెండు చేతులకు బీపీ చూసినప్పుడు సిస్టాలిక్ బీపీలో ఏమైనా తేడాలుంటే దాన్ని బట్టే భవిష్యత్తులో గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. రెండు చేతులకు సిస్టాలిక్ బీపీలో పది పాయింట్ల కంటే ఎక్కువ తేడా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న 3,390 మందిని పరిశీలించిన పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News