: సోనియాతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, జేడీ శీలం, డొక్కా, రఘువీరా రెడ్డి, సీ.రామచంద్రయ్య, కాసు కృష్ణారెడ్డి, కొండ్రు మురళీ, బాలరాజు, తదితరులు సోనియా నివాసంలో సమావేశమైన వారిలో ఉన్నారు.