: లింగ సమతౌల్యం తెస్తున్న అనర్ధం!
మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు. ఇది విన్నప్పుడల్లా, లేక సినిమాలలో చూసినప్పుడల్లా ఇదేమి విడ్డూరం అని గొణగడం సర్వ సాధారణం. నాడు పాండవులు ఎందుకలా చేశారో మనకు తెలియదు కానీ, నేడు ఒక గ్రామంలో యువకులు అలానే చేస్తున్నారు.
తిండిగింజల కరవు, వాన కరవు, నీటి కరవు, విద్యుత్ కరవు.. ఎక్కడ చూసినా ఏదో ఒక కరవు కనిపించకమానదు. దేశంలో కరవు జాబితాలో భవిష్యత్తులో కన్య కూడా చేరుతుందా? అనిపించే గడ్డు పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. కన్యలు లేక బ్రహ్మచారులు ముదురు బెండకాయలవుతుండడం నేటి కలికాలపు చోద్యం.
మనకు తెలిసి బహుభార్యత్వం ఆచారమే దేశంలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు బహు భర్తల ఆచారం కూడా మొదలైంది. దీనిని చూడాలంటే మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాలో ఉన్న చిన్న గ్రామం సరాయ్ చోలా దాని చుట్టు పక్కనున్న గ్రామాలకు వెళ్లాలి. ఇక్కడ ఒక ఇంట్లో అన్నదమ్ములు ఎంత మంది ఉన్నా ఆ ఇంట ఒకే కోడలు పిల్ల కనిపిస్తుంది.
ఇందుకు కారణం లింగ సమతౌల్యం లేకపోవడమే. ఆడపిల్లలు చాలా తక్కువ మందే ఉండడం వల్ల ఈ వింతాచారం మొదలైంది. ఒక తల్లికి పుట్టిన అబ్బాయిలందరూ ఒక్క పడచునే పెళ్లాడడం మొదలెట్టారు. ఇక్కడ ఒక ఇంట్లో ఏ యువకుడైనా ముందుగా మనువాడితే.. అతడి భార్యపై బావలకూ హక్కు ఉంటుందట. సరాయ్ చోలా గ్రామంలో 8 మంది భర్తలు ఉన్న మహిళలూ ఉన్నారట. ఒకరు ఒకరినే పెళ్లాడడం చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది. సరాయ్ చోలాతో పాటు చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాలూ ఈ ఆచారాన్నే ఫాలో అవుతున్నాయి.
అంతెందుకు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు సమీపంలోని ఒక చిన్న గ్రామానికి వెళితే మీకు ఐదుగురు భర్తలున్న రాజోవర్మ అనే మహిళ కనిపిస్తుంది. ఈ గ్రామంలోనూ కన్యల కరవు తాండవిస్తోంది. అమ్మాయిలు వద్దనుకుంటూ గర్భంలోనే చిదిమేస్తున్న కారణంగానే నేడు ఈ గడ్డు పరిస్థితులు దాపురించాయి. ముందు ముందు ఈ ఆచారం ఏ స్థాయికి చేరుతుందో అన్నది మనపై, అమ్మాయిల విషయంలో అనుసరించే ధోరణిపైనే ఆధారపడి ఉంది.