: అదిగో పులి.. ఇదిగో పులి!
అదిగో పులి.. వామ్మో పులి.. ఈ రకమైన వదంతులు, భయాందోళనలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని మధుర పట్టణంలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో పులిని చూశామంటూ వదంతులను ప్రచారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. అదే సమయంలో తమ నివాస పరిసరాల్లో చిరుతపులి ఉందేమో పర్యవేక్షిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం సమీప అడవుల్లోంచి పట్టణంలోకి చొరబడ్డ ఒక చిరుతపులి ఆరుగురిని గాయపరిచింది. ఓ ఆస్పత్రిలో బంధించినా.. తప్పించుకుని పోయింది. దీని కోసం ఆర్మీ సిబ్బంది, అటవీ అధికారులతో కలిసి మూడు రోజులుగా గాలింపు జరుపుతున్నారు. అయినా ఫలితం లేదు.