: జలాంతర్గామి సింధురత్నలో పొగలు


భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామిలో పొగలు వచ్చాయి. ముంబై తీరానికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సింధురత్నను పరీక్షల నిమిత్తం సముద్రంలోకి తీసుకెళ్లారు. అయితే టెస్టింగ్ సమయంలో దాని బోర్డింగ్ లో పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో పొగవల్ల బోర్డులో ఉన్న నావికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో వీరిని హెలికాప్టర్ ద్వారా వెంటనే ముంబై ఆసుపత్రికి తరలించారు. ఘటనా సమయంలో సింధురత్న బోర్డులో వెస్టర్న్ నావల్ కమాండ్ కి చెందిన సబ్ మెరైన్ సీనియర్ మోస్ట్ అధికారి కూడా ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో సింధురత్నలో ఎలాంటి ఆయుధాలు కాని, పేలుడు పదార్థాలు కాని లేవు. గత ఆగస్టులో కూడా ముంబై హార్బర్ లో ఉన్న మరో జలాంతర్గామి సింధు రక్షక్ లో పేలుడు సంభవించి, మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 18 మంది నావికులు మృతి చెందారు.

  • Loading...

More Telugu News