: సోదరుడి డైరెక్షన్ లో సోనాక్షి


బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా ఇటీవల తన సోదరుడు కుష్ సిన్హా దర్శకత్వంలో నటించింది. గతంలో సంజయ్ లీలా బన్సాలీ 'సావరియా', ఇంకా 'బేషరమ్', 'దబాంగ్' చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన కుష్ ఆ అనుభవంతో తన సోదరి సోనాక్షిని పెట్టి తొలి వాణిజ్య ప్రకటనను రూపొందించాడు. 'షాట్ గన్ మూవీస్' బ్యానర్ పై ప్రకటనను నిర్మించారు. ఈ విషయాన్ని పెద్ద సోదరుడు లవ్ సిన్హా ట్విట్టర్ లో తెలిపాడు. టీమ్ అంతా కలసి ఓ ఇంట్లో ప్రకటనను రూపొందించారని, చాలా కొత్తగా వచ్చిందని, సోనాక్షి అభిమానులు ప్రకటనను బాగా ఇష్టపడతారని చెప్పాడు. ప్రస్తుతం అన్ని ప్రధాన టీవీ చానళ్లలో ఈ యాడ్ ప్రసారమవుతుందని కుష్ చెప్పాడు.

  • Loading...

More Telugu News