: ప్రేమోన్మాది చేతిలో 14ఏళ్ల విద్యార్థిని హతం


ప్రేమోన్మాదం మరో విద్యార్థినిని బలితీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కాన్కూరు లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే, 9వ తరగతి చదువుతున్న అనూష (14)ను అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రవి తనను ప్రేమించాలంటూ రెండు నెలల నుంచి వేధిస్తున్నాడు. రవి ప్రేమను అనూష తిరస్కరించింది. దీనికి తోడు ఈ విషయాన్ని తెలుసుకున్న అనూష కుటుంబసభ్యులు, బంధువులు పలుమార్లు రవిని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన రవి... నిన్న రాత్రి అనూష ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అనూషను చూసి ఆమె తల్లి కేకలు వేయడంతో, స్థానికులు ఆమెను వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది.

  • Loading...

More Telugu News