: మా అమ్మ ప్రపంచంలోనే అందమైన మహిళ: అమితాబ్


తన తల్లిదండ్రులు తనకెంతో స్ఫూర్తి ప్రదాతలని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. తన మాతృమూర్తిని ప్రపంచంలోనే అందమైన మహిళగా భావిస్తానన్నారు. తన తల్లిదండ్రుల కడుపున పుట్టడం అదృష్టమని చెప్పారు. సినీ జర్నలిస్టు ప్రియాంక ఝా తొలి రచన 'సూపర్ ట్రయట్స్ ఆఫ్ సూపర్ స్టార్స్' పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించిన సందర్భంగా అమితాబ్ మాట్లాడారు. ప్రోత్సాహం అనేది భిన్న రంగాల నుంచి కూడా వస్తుందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి తనకు దిలీప్ కుమార్, వహీదా రెహ్మాన్ తదితరులు స్ఫూర్తినీయులన్నారు. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ 2003లో కాలం చేయగా, తల్లి తేజీ బచ్చన్ 2007లో మరణించారు.

  • Loading...

More Telugu News