: అనుమతి ఇవ్వొద్దని సుప్రీమే చెప్పింది: సబిత
సడక్ బంద్ వంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సడక్ బంద్ పై శాసనసభలో సబిత ఈ రోజు ప్రకటన చేశారు. బంద్ కు అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయినా రెండు రోజులు బంద్ నిర్వహించారని మంత్రి చెప్పారు. బంద్ విషయంలో చట్టం ప్రకారమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమయంలో 17 మంది శాసనసభ్యులపై చర్యలు తీసుకున్నామన్నారు. సభ్యుల అరెస్టు విషయం స్పీకర్ కు తెలియజేశామని హోంమంత్రి వివరించారు.
- Loading...
More Telugu News
- Loading...