: హైదరాబాదును దేశ రెండో రాజధాని చేయాలి: సోమిరెడ్డి


దేశానికి రెండో రాజధానిగా హైదరాబాదు నగరాన్ని చేయడంపై పార్టీలన్నీ ముందుకు రావాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాదును రెండో రాజధానిగా చేయడమనేది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. 1955లోనే  హైదరాబాదు దేశానికి రెండో రాజధానిగా సరితూగుతుందని బి.ఆర్. అంబేద్కర్ చెప్పారన్నారు. ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News