: కర్నూలు రాజధానిగా చేయాలని ఆ ముగ్గురూ ఎందుకు అడగటం లేదు?: బైరెడ్డి
కర్నూలును కొత్త రాజధానిగా చేయాలని రాయలసీమకు చెందిన నేతలే అడగడం లేదని, ఆ ముగ్గురు నేతలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమికొడతారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో నూతన రాజధానిని నిర్మించాలని కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్ డిమాండ్ చేయకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈరోజు (మంగళవారం) బైరెడ్డి కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గురు నేతలకు రాయలసీమ గురించి, శ్రీ బాగ్ ఒప్పందం గురించి ఏమీ తెలియదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఆ ముగ్గురూ రాయలసీమలోనే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు. పూర్వం ఆంధ్రకు రాజధానిగా కర్నూలు ఉండేదన్న విషయం ఆ ముగ్గురూ మరువకూడదని బైరెడ్డి హితవు పలికారు.