: ఎన్నికల తరువాతే తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే: మర్రి
తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే (ఆవిర్భావ దినోత్సవం) లోక్ సభ ఎన్నికల తరువాత ఉండాలని జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలంలో కొన్ని గ్రామాలు సీమాంధ్రలో కలపడంతో 3 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్త వహించాలని తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ముందే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నియోజకవర్గ పునర్నిర్మాణం జరిగిన తరువాతే శాసనసభ ఎన్నికలు జరగాలని ఆయన సూచించారు.