: కేజ్రివాల్ ఆరోపణలను ఖండించిన రిలయన్స్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఆరోపణలను రిలయన్స్ వర్గాలు ఖండించాయి. రిలయన్స్ కు, ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీకి ప్రపంచంలో ఎక్కడా అక్రమ ఖాతాలు లేవని స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో కేజ్రివాల్ మాట్లాడుతూ, ముకేశ్ కు రెండు స్విస్ బ్యాంకు ఖాతాలున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రిలయన్స్ నేడు స్పష్టమైన ప్రకటన చేసింది. వ్యాపార రీత్యా రిలయన్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, అవన్నీ సక్రమమేనన్నది ఆ ప్రకటన సారాంశం. కేజ్రివాల్ ఈ ఖాతాల విషయంలోనే కాకుండా, గ్యాస్ ధరల అంశంలోనూ ముకేశ్ ను వేలెత్తిచూపాడు. దేశంలో ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరత సృష్టించి, తద్వారా ధర పెరుగుదలకు కారణమవుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, ముకేశ్ అంబానీ కుమ్మక్కయ్యారని కేజ్రివాల్ సీఎంగా రాజీనామా చేయకముందు ఆరోపించారు.