: మోడీ ప్రజలను మోసం చేస్తున్నారు: రాహుల్ గాంధీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అసోంలోని గౌహతీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే గత 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 3 నెలల్లో చేస్తామనే భ్రమ కల్పిస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో 15 కోట్ల మంది ప్రజలను దారిద్ర్యరేఖ ఎగువకు తీసుకువచ్చామని అన్నారు. బీజేపీది వేర్పాటు వాదమని రాహుల్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ యువకుడు నిడో తానియా మృతి విచారకరమని అన్న రాహుల్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకు కృషి చేస్తామన్నారు.