: శాంసంగ్ పై కామెడీ చేస్తున్న నోకియా


మొబైల్ దిగ్గజం నోకియా తన ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్ పై వ్యంగ్యోక్తులు విసురుతోంది. అందుకు ఈ సంస్థ ట్విట్టర్ ను వేదికగా చేసుకుంది. కొరియన్ టెక్నో జెయింట్ శాంసంగ్ కొత్త మోడల్ మొబైల్ గెలాక్సీ ఎస్5ను లాంచ్ చేయకముందే... దానిపై నోకియా సెటైర్లు వేసింది. 'సేమ్ సంగ్' అంటూ ట్వీట్ చేసింది. అంటే తమ మోడల్ కు శాంసంగ్ ఫోన్ నకలు అని దానర్థం. నోకియా సంస్థ శాంసంగ్ ను సేమ్ సంగ్ అని పిలవడానికో కారణం ఉంది. ఇతర పోటీదారుల మోడళ్ళను, ఫీచర్లను కాపీ కొడుతుందని శాంసంగ్ పై పలు ఆరోపణలున్నాయి.

ఈ కొరియా దిగ్గజంపై నోకియా వ్యంగ్యోక్తులు విసరడం ఇదే తొలిసారి కాదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్4 విడుదల చేసినప్పుడు... ఓ క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థి నుంచి మరో విద్యార్థి కాపీ కొడుతూ ఉన్న చిత్రాన్ని నోకియా ట్వీట్ చేసింది. నోకియా టార్గెట్ చేసుకుంది ఒక్క శాంసంగ్ అనే అనుకునేరు! స్మార్ట్ ఫోన్ సృష్టికర్త ఆపిల్ పైనా విమర్శలు చేసింది. ఐఫోన్ 5సి ఆవిష్కరించగానే, దాన్ని తమ ఫోన్ల స్ఫూర్తిగానే తయారుచేసినట్టుందని వ్యాఖ్యానించింది నోకియా.

  • Loading...

More Telugu News