: యూపీఏ, ఎన్డీయేల ఓటమే థర్డ్ ఫ్రంట్ లక్ష్యం: ప్రకాశ్ కారత్


ఢిల్లీలో మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్) సమావేశం ముగిసింది. లోక్ సభ ఎన్నికల్లో పదకొండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం సీపీఎం నేత ప్రకాశ్ కారత్ మీడియాకు తెలిపారు. ఎన్నికల తర్వాత మూడో కూటమి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు. యూపీఏ పాలన అవినీతిమయమైందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అవినీతి పెచ్చురిల్లిందన్నారు. యూపీఏ హయాంలో దేశమంతా కుంభకోణాలమయంగా మారిందని విమర్శించిన కారత్... బీజేపీ, కాంగ్రెస్ విధానాల్లో పెద్ద తేడా ఏమీ లేదన్నారు. యూపీఏ, ఎన్డీయే కూటమి ఓటమే తమ ధ్యేయమని చెప్పారు. కాగా, నేటి భేటీకి బీజేడీ, ఏజీపీ, జేవీఎం నేతలు గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News