: స్పీకర్ తో కలసి నితీష్ కుమార్ కుట్ర చేశారు: లాలూ


తమ పార్టీని చీల్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ శాసనసభ స్పీకర్ తో కలసి కుట్ర పన్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ మైనారిటీలో ఉన్న తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నితీష్ కుమార్ తమ పార్టీ నేతలపై కన్నేశారని విమర్శించారు. తమ ఎమ్మెల్యేలకు పదవుల ఆశ చూపి ఆర్జేడీని చీల్చాలనుకున్నారని అన్నారు. ఇందులో అసెంబ్లీ స్పీకర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. నితీష్ కుట్రను బట్టబయలు చేస్తామని అన్నారు. నిన్న 13 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వీరిలో 9 మంది నాటకీయంగా తిరిగి వెనక్కి వచ్చారు. అయితే, లాలూ ఆరోపణలను నితీష్ కుమార్ తోసిపుచ్చారు.

  • Loading...

More Telugu News