: బాలీవుడ్ తారలపై తాజా నేరాభియోగాలు


క్రిష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలపై రాజస్థాన్ లోని జోథ్ పూర్ కోర్టులో తాజా నేరాభియోగాలు నమోదయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద వీరిపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అయితే ఆయుధ చట్టంపై గతంలో నమోదైన అభియోగాలను తొలగించింది.

14 సంవత్సరాల క్రితం 'హమ్ సాత్ సాత్ హై' చిత్ర షూటింగ్ సమయంలో జోధ్ పూర్ సమీపంలోని కంకానీ గ్రామంలో రెండు క్రిష్ణ జింకలను వేటాడినందుకు వీరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించే జోధ్ పూర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ర్టేట్ వీరిపై తాజాగా నేరాభియోగాలను నమోదు చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు.

నేరం నిరూపితమైతే ఆరుగురు నటీనటులు ఆరు సంవత్సరాల వరకూ జైలు శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. కేసు విచారణ కోసం సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలమ్ నిన్ననే జోధ్ పూర్ కు చేరుకున్నారు. అయితే కోర్టులో కేసు విచారణకు సల్మాన్ మాత్రం హాజరు కాలేదు. 

  • Loading...

More Telugu News