: ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎస్ సమీక్ష సమావేశం
హైదరాబాదు సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అంశంపై ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల వివరాలకు సంబంధించిన చర్చ సాగుతోంది. రేపు సీఎస్ మహంతి ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారు. బుధవారం నాడు జరిగే కేంద్ర హోంశాఖ సమావేశానికి ఆయన హాజరవుతారు.