: చిరంజీవి తనకిచ్చిన మాట తప్పారంటున్న ఓ వికలాంగుడు


ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి తనకిచ్చిన మాట తప్పారని ఓ వికలాంగుడు వాపోయాడు. వివరాల్లోకెళితే... 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో జరిగిన ఆవిర్భావ సభలో తిరుమలయ్య అనే వికలాంగుడితో జెండా ఆవిష్కరింపజేశారు. అప్పట్లో చిరంజీవి ఆ యువకుడిని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, చిరు మాట వేదికకే పరిమితమైంది. ఆ తర్వాత ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా తిరుమలయ్యకు చిరంజీవి అపాయింట్ మెంట్ దొరకలేదు. తనను దత్తత తీసుకుంటానని తిరుపతి సభలో చెప్పిన చిరంజీవి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఈ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

2012లో ఉపఎన్నిక సమయంలో తిరుపతి వచ్చినప్పుడు చిరంజీవి తన చేతిలో ఓ వెయ్యి రూపాయలు పెట్టారని, అంతకుమించి మరేమీ ప్రస్తావించలేదని వెల్లడించాడు. పుట్టుకతోనే అంగవైకల్యం బారినపడిన ఈ యువకుడు కన్నవారికీ భారమైపోయాడు. చిన్ననాటి నుండే డ్యాన్సులు చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి కనీసం తనకు వికలాంగుల పెన్షన్ కూడా ఇప్పించలేదని తిరుమలయ్య ఆక్రోశించాడు.

  • Loading...

More Telugu News