: మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడిపై కిడ్నాప్ కేసు


మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  పబ్ కు సంబంధించిన వ్యవహారంలో మంత్రి తనయుడు విక్రమ్ తమను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టాడంటూ ఇద్దరు వ్యక్తులు శశికాంత్, చంద్రశేఖర్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్విడార్ పబ్ సిటీ సెటిల్ మెంట్ వ్యవహారంలో విక్రమ్ తమను వేధించాడని వారు ఆరోపిస్తున్నారు. 

ఈ ఉదంతానికి సంబంధించి విక్రమ్ తో పాటు మరో ముగ్గురిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు భాగస్వాములు కలిస పబ్ నిర్వహిస్తుండగా ఆర్థిక లావాదేవీల్లో తేడాలొచ్చి క్రాంతి అనే భాగస్వామి విక్రమ్ గౌడ్ ను ఆశ్రయించాడని తెలుస్తోంది. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.    

  • Loading...

More Telugu News