: కోర్టులో లొంగిపోయిన మాజీ ముఖ్యమంత్రి కోడలు
జార్ఖండ్ లో అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ కోడలు సీతా సోరెన్ స్థానిక కోర్టులో లొంగిపోయారు. 2012లో జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన అక్రమాల కేసులో సీతా సోరెన్ నిందితురాలు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఫిబ్రవరి 20న సీతా సోరెన్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసి, వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో సీతా సోరెన్ ఈ రోజు కోర్టులో లొంగిపోయారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శిబుసోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య సీత. ఈ కేసులో ఆమె తండ్రి మాంఝీ, ప్రైవేటు కార్యదర్శి మండల్ కూడా ఈ కేసులో నిందితులు కావడం విశేషం.