: విలీనం వద్దని 90 శాతం మంది చెబుతున్నారు: టీఆర్ఎస్ నేత వినోద్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేయరాదంటూ 90 శాతం మంది నేతలు అభిప్రాయపడుతున్నారని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో, రాష్ట్ర పునర్నిర్మాణం కూడా అంతే ముఖ్యమని... కేసీఆర్ నాయకత్వంలోనే పునర్నిర్మాణం జరగాలని తామంతా కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విలీనమా? పొత్తా? అనే అంశాలపై చర్చ ఒక రోజులో ముగిసేది కాదని తెలిపారు. కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తే విలీనంపై ఆలోచిస్తామని చెప్పారు.