: జాతీయ స్థాయి హామీలతో జయలలిత మేనిఫెస్టో
లోక్ సభ ఎన్నికలకు నిన్న అభ్యర్థులను ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలో ఈ ఉదయం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో ఆమె జాతీయ స్థాయి హామీలను పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచుతామని, పెట్రోలు, డీజిల్ ధరల నిర్ధారణ విధానాన్ని మారుస్తామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత్ కు శాశ్వత స్థానం కోసం కృషి చేస్తామని ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు.