: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై 13 పార్టీల సమావేశం
కాంగ్రెస్, బీజేపీయేతర 11 పార్టీల సమావేశం ఢిల్లీలో కాసేపట్లో ప్రారంభం కానుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకోనటువంటి తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, అన్నాడీఎంకే, వామపక్షాలు, ఎస్పీ, జనతాదళ్ సెక్యులర్, బిజు జనతాదళ్ తదితర పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశం అనంతరం థర్డ్ ఫ్రంట్ పై నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. అర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ థర్డ్ ఫ్రంట్ లో చేరడం లేదని స్పష్టం చేశారు.