: మిలిటెంట్లపై బాంబుల వర్షం కురిపిస్తున్న పాక్ వాయుసేన
పాకిస్తాన్ కళ్ళు తెరిచింది! ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని మొత్తుకుంటున్న ప్రపంచ దేశాల గోడును ఇన్నాళ్ళకు తలకెక్కించుకుంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సరిహద్దు గిరిజన ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఉదయం పాక్ ఫైటర్ జెట్లు వజీరిస్తాన్ లోని మిలిటెంట్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మరణించినట్టు పాక్ వర్గాలు తెలిపాయి. గతవారం జరిపిన దాడుల్లోనూ మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో హతమైన సంగతి తెలిసిందే. వజీరిస్తాన్ లో తీవ్రవాద శిక్షణ శిబిరాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని, అందుకే ఆ ప్రాంతంలో దాడులు నిర్వహిస్తున్నామని పాక్ సైన్యం తెలిపింది.