: 'టాప్ లెస్ యోగా'తో మతిపోగొడుతున్న మోడల్ ముద్దుగుమ్మ
పూనమ్ పాండే... నెటిజన్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా సోషల్ మీడియాతో ఎంత సంచలనం సృష్టించవచ్చో ఈ మోడల్ ముద్దుగుమ్మను చూస్తే అర్థమవుతుంది. భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిస్తే నగ్నత్వాన్ని ఆరబోస్తానని చెప్పి తొలిసారిగా సెన్సేషన్ తలుపుతట్టింది. ధోనీ సేన కప్ గెలిచింది... పూనమ్ మాట తప్పింది. అదలా ఉంచితే, ఇప్పుడు టాప్ లెస్ యోగాతో మరోసారి వార్తల్లోకెక్కిందీ అమ్మడు. చిన్న ప్యాంటీ తప్ప ఒంటిపై మరో ఆచ్ఛాదన లేకుండా మతులు పోగొడుతోంది. ఈ ఫొటోలను ట్విట్టర్లో పెట్టి ఆ సోషల్ నెట్ వర్క్ ట్రాఫిక్ పెంచేసింది. ట్విట్టర్లో ఆమె ఖాతాను సందర్శిస్తే కళ్ళు చెదిరిపోయే యోగాసనాలతో కూడిన ఫొటోలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తాయి. అంతేగాకుండా, ఇలాంటివే మరిన్ని ఫొటోలు పోస్ట్ చేస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇస్తోందీ వయ్యారిభామ.