: మధ్యాహ్నం రాజ్ నాథ్ తో కేసీఆర్ భేటీ
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందేలా సహకరించిన నేతలకు ధన్యవాదాలు తెలిపే పనిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఈ మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ కలవనున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి పూర్తి మద్దతు తెలిపిన రాజ్ నాథ్ కు తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతారు.