: రూ.1500కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటున్న మొజిల్లా


ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ రూపకర్త మొజిల్లా స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లోకి అడుగుపెడుతోంది. అయితే, పోటీదారులకు దిమ్మదిరిగేలా ప్రవేశిస్తోంది. స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.1500కే అందిస్తామని పేర్కొని... శాంసంగ్, నోకియా, సోని కంపెనీలకు సవాల్ విసిరింది. ప్రముఖ చిప్ తయారీదారు చైనాకు చెందిన స్ప్రెడ్ ట్రమ్ తో సంయుక్తంగా మొజిల్లా ఈ ఫోన్ రూపొందించింది. వర్థమాన దేశాల మార్కెట్లలో ఈ ఫోన్లను ప్రవేశపెడతామని మొజిల్లా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జే సల్లివాన్ తెలిపారు. త్వరలోనే ఇవి భారత్ లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News