: రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై హైకోర్టులో పిల్
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం రాజీనామా చేయడంతో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై న్యాయవాది కృష్ణదేవన్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. సీఎం రాజీనామా చేసి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ పిలవలేదని, రాష్ట్రపతి పాలన కూడా విధించలేదని పిల్ లో పేర్కొంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, స్పీకర్, పీసీసీ చీఫ్, టీడీపీ అధినేత చంద్రబాబును పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు.