: మహానేత మరణంవల్లే రాష్ట్రంలో అనిశ్చితి: పిల్లి


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతోనే రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కొంచెం సేపటి క్రితం ఆయన కృష్ణా జిల్లా జొన్నపాడులో విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పార్టీ నేతలు పిల్లి సుభాష్, కొడాలి నాని, ఎంవీఎస్ నాగిరెడ్డి నివాళులర్పించారు.

జగన్ కు అనుకూలంగా మొట్టమొదటగా మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, కొంతకాలంగా అలకబూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  

  • Loading...

More Telugu News