: విద్యార్థులు ప్రాణులను కోయకుండా నిషేధించాలి: పెటా
కాలేజీలలో విద్యార్థుల అధ్యయనంలో భాగంగా కప్పలు ఇతర ప్రాణులు, జంతువులను కోసి పరీక్షించకుండా పూర్తిగా నిషేధం విధించాలని జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పెటా యూజీసీని కోరింది. దీంతో దశల వారీగా ఈ విధానానికి స్వస్తి చెప్పాలని యూజీసీ అన్ని వర్సిటీలకు లేఖలు రాసింది. వైద్య కోర్సులు, సైన్స్ కోర్సులలో ఈ విధానాన్ని పాటిస్తున్నారు.