: తమిళనాట పురచ్చితలైవి వీరభక్తి
తమిళనాట రాజకీయనాయకులు, సినీనటుల అభిమానుల అభిమానానికి హద్దులు ఉండవు. ఏ చిన్న సందర్భం వచ్చినా అభిమానులు చేసే హడావిడికి అంతే ఉండదు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు సందర్భంగా తమిళ తంబీలు పార్లమెంటు నమూనాలో భారీ కేకును తయారు చేయించి కట్ చేశారు. మరి కొందరు అభిమానులు ప్రపంచ అగ్రనేతలు ఒబామా, సర్కోజీ, కిమ్ జంగ్ ఉన్ వంటి వారంతా జయలలితను కీర్తిస్తున్నట్టు ముద్రించిన భారీ ఫ్లెక్సీని చెన్నైలో ఏర్పాటు చేశారు. జయలలిత థర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిగా అందరూ ఊహాగానాలు చేస్తుండడంతో ఈ ఫ్లెక్సీ ఆసక్తి రేపుతోంది.