: ఆకాశంలో ఎగిరే వస్తువు.. అధికారులకు ముచ్చెమటలు
ఆకాశంలో దూరంగా గుర్తు తెలియని వస్తువు ఎగురుతోంది. పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత్ వైపు చొచ్చుకు వస్తున్నట్లు అమృత్ సర్ లోని వాయుసేన రాడార్లు గుర్తించాయి. దాని సంగతేంటో తేల్చడానికి వెంటనే యుద్ధవిమానం టేకాఫ్ తీసుకుంది. ఆ ఎగిరేవస్తువు సమీపం వరకు వెళ్లగా.. అదొక వెదర్ బెలూన్ గా గుర్తించారు. చివరికి అది భారత్ లోకి రాకుండానే వెళ్లిపోయింది. ఈ బెలూన్ రెండు ప్రయాణికుల విమానాలకు సమీపంగా వచ్చినట్లు గుర్తించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన అధికారులను పరుగులు పెట్టించింది.