: థర్డ్ ఫ్రంట్ పై ఊపందుకుంటున్న చర్చలు.. నేడు ఢిల్లీలో నేతల భేటీ
దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలనతో విసుగెత్తిన ప్రజలకు కొత్త ప్రభుత్వాన్ని అందించేందుకు థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడేందుకు పలు ప్రాంతీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్న పదకొండు పార్టీల నేతలు నేడు ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఓ స్పష్టతకు రానున్నారు. లెఫ్ట్ పార్టీలు, ఏఐఏడీఎంకే, సమాజ్ వాదీ, జనతా దళ్ (యునైటెడ్), జేడీ (ఎస్) ఇతర పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వస్తున్నా నేతలు ధీమాతో ముందుకెళ్లడం గమనార్హం. ఎలాగయినా కాంగ్రెస్, బీజేపీలను పడగొట్టి తమ హవా చూపాలని చూస్తున్నారు.